జర్మనీ రాజధాని బెర్లిన్ ప్రభుత్వం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నగరంలోని పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో పురుషులతో పాటు మహిళలకు కూడా టాప్‌లెస్‌గా ఈతకొట్టేందుకు అనుమతిచ్చింది. ఓ మహిళ చేసిన పోరాటం ఫలితంగానే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. శరీరం పైభాగాన ఆచ్చాదన లేకుండా ఈతకొట్టే విషయంలో మహిళల పట్ల అసమానత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, పరిశీలించిన అధికారులు ఈ కొత్త నిబంధనలు జారీ చేశారు.