కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలుపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో వందే భారత్ రైలుపై దాడి జరిగింది. ఫరక్క సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లదాడి చేశారు. దీంతో రైలులోని పలు కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తూర్పు రైల్వే అధికారులు తెలిపారు.