మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ సహా ఏడు చోట్ల తనిఖీలు చేస్తున్నారు సీఐడీ అధికారులు. 24 గంటలుగా అధికారులు సోదాలు చేస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్లు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శి పై కేసు నమోదు కాగా, మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావుపై కూడా సిఐడి కేసు నమోదు చేసింది.