ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి శవంలా తిరిగొచ్చాడు. బాపట్ల జిల్లా జొన్నతాళికి చెందిన గోవాడ నాగసాయి గోపి అరుణ్ కుమార్(23) ఎంఎస్ చేసేందుకు ఏడు నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఈ నెల ఒకటి నుండి అరుణ్ కనిపించడం లేదని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన సమీపంలోని సరస్సులో అరుణ్ మృతదేహం లభించింది. పోలీసులు శవపరీక్షలు నిర్వహించి, స్నేహితుల సాయంతో ఇండియాకు పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa