ఎమ్మెల్యే ఇంటి ముందు అదే పార్టీకి చెందిన కార్యకర్త కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఏపీలోని నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి ముందు వైఎస్సార్ సీపీ క్రియాశీలక కార్యకర్త భాస్కర్ రెడ్డి తన భార్యిపిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. నమ్మిన వైసీపీ నేతలే తనను దారుణంగా మోసం చేసారని ఆరోపించాడు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.