రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతుంది. ఉక్రెయిన్‌లోని బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోరాటంలో ఒకే రోజు 500 మందికి పైగా రష్యన్ సైనికులను మట్టుపెట్టామని ఉక్రెయిన్ వెల్లడించింది. వారిలో 221 మంది కచ్చితంగా చచ్చిపోయారని మిగిలిన వారు తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచి ఉండొచ్చని పేర్కొంది. అయితే ఉక్రెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలను రష్యా కానీ ఇతర ఏ మీడియా కానీ ధృవీకరించలేదు.