సాధారణంగా దొంగతనానికి వచ్చిన దొంగలు దొరికినకాడికి దోచుకొని వెళ్లిపోతారు. కానీ చోరీకి వచ్చిన దొంగ మద్యం మత్తులో ఆహారం తినేసి బెడ్ రూంలో హాయిగా నిద్రపోయిన ఘటన చెన్నైలో జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లిన ఆ ఇంటి యజమాని శనివారం వచ్చి చూడగా బెడ్ రూంలో దొంగ నిద్రిస్తూ కనిపించాడు. వారు అతన్ని లేపగానే పారిపోయాడు. సీసీటీవి ఆధారంగా పోలీసులు నిందితుడు ఎంజుమలైని అదుపులోకి తీసుకున్నారు.