మద్యం మత్తులో ఓ వ్యక్తి తన అత్తను కొట్టి చంపిన ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. రాము ఆరేళ్లుగా హనుమంతువాక కొండవాలులో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. భార్యకు ఆరోగ్యం బాలేకపోవటంతో ఆమె అమ్మ నారాయణమ్మ (47) అల్లుడి ఇంటికి వచ్చింది. రాము శనివారం మద్యం తాగి ఇంటికి రావడంతో అత్త, అల్లుడి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాము ఇనుపరాడ్డుతో అత్త తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించారు.