పాకిస్థాన్లోని పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిపోవటంతో 10మంది అక్కడికక్కడే మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 46 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వారందరూ దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. కాలువ నుంచి 10 మంది మృతదేహాలను వెలికితీశామని ఇంకా 9 మంది కాలువలో గల్లంతయ్యారని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa