వేసవి దాహార్తి తీర్చుకోవడానికి కల్తీ లేని సహజ సిద్ధ ఆహారం తాటిముంజలు. వీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ, బీ, సీ విటమిన్లతో పాటు పొటాషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయంటున్నారు. ముంజలు రోగ నిరోధక శక్తి పెంచడం సహా జీర్ణశక్తిని పెంచుతాయని చెబుతున్నారు. శరీరంలోని విష పదార్థాలు తొలగించడం సహా క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయంటున్నారు.