శాసనమండలి ఎన్నికలకు సంభందించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోలింగ్ కు 48 గంటలు ముందుగా ప్రచారంపై నిషేధం విధించామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ 11 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా ప్రకటనలు, గానీ , బల్క్ ఎస్ఎంఎస్ ల ద్వారా గానీ , ఇతరత్రా ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు గాని నిర్వహించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.