నందలూరు మండల పరిధిలోని సోమశిల ప్రాజెక్టు వెనుక జనాలలో శనివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. కొండమాచపల్లి పరిధిలోని పల్లాగట్టు వద్ద నిలకడగా ఉన్న బ్యాక్ వాటర్ నుండి ఈ మృతదేహం కొట్టుకు వచ్చింది. చనిపోయిన వ్యక్తి 35 ఏళ్ల వయసు గలిగే ఉంటాడని చేపల పట్టి జీవించేందుకు వచ్చిన కూలీగా స్థానికులు చెబుతున్నారు. చేపల వ్యాపారస్తుడు ఇంటికి పంపకపోవడంతో నీళ్లలోకి దూకి పారిపోయే ప్రయత్నంలో మృతి చెందినట్లు ముంపు వాసులు చెప్తున్నారు. మృతదేహం సమాచారం అందుకున్న ఏఎస్ఐ సుబ్బరాయుడు, హెడ్ కానిస్టేబుల్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లేసరికి నీటి తాకిడి కొట్టుకుపోయినట్లు వారు గుర్తించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ మృతదేహం పూర్తి వివరాలు తెలియవని మృతదేహం నీటి ఉధృతికి కొట్టుకుపోయిందని బయటపడితే గాని చెప్పలేమని అన్నారు.