బీబీసీలోని ఉద్యోగులంతా తమ ఐక్యతను నిరసన రూపంలో చాటారు. బీబీసీ మరో వివాదంలో చిక్కుకుంది. ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఓ యాంకర్‌ను విధుల నుంచి తప్పుకోవాలంటూ ఆదేశించి సమస్యల్లో పడింది. బాధిత యాంకర్‌కు మద్దతుగా సహచర ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో బీబీసీలో పలు కార్యక్రమాలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. అక్రమవలసలను నిరోధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఇందులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉండడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో బీబీసీలోని ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ గారీ లైన్కర్ బ్రిటన్ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కొత్త చట్టం జర్మనీలో నాజీల నిరంకుశత్వాన్ని గుర్తుకుతెస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీబీసీ యాజమాన్యం ఆయనపై కన్నెర్ర చేసింది. విధుల నుంచి తక్షణం తప్పుకోవాలంటూ ఆదేశించింది. దీంతో.. గారీ నిష్క్రమించారు.