గుంటూరు: రైలు పట్టాలపై వృద్ధుడి మృతదేహం పడి ఉన్న ఘటనపై ఆదివారం గుంటూరు జీ ఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద రైలు పట్టాలపై మృతదేహం ఉందనే సమాచారంతో సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అతని వయసు 55 సంవత్సరాలు ఉండవచ్చని, పేరు వివరాలు తెలియలేదన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.