ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తెలియచెప్పి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేయడం గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల బాధ్యత అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. ఆదివారం చెరుకుపల్లి లో జరిగిన వాలంటీర్లు, గృహ సారధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడుతూ అనేక ఆటుపోటులను ఎదుర్కొన్న వ్యక్తి జగన్ అన్నారు. ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చి పేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. కష్టపడిన ప్రతి వ్యక్తిని పార్టీ గుర్తిస్తుందన్నారు.