జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం లో మంగళవారం చిన్నారులకు మాత్రల (అల్బెండజోల్) పంపిణీ జరగనుందని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడితే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళా శాలలు, , అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే 1 నుంచి 19 ఏళ్ల మధ్యన ఉన్న వారికి మాత్రల పంపిణీ జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. మంగళవారం తరగతులకు హాజరు కాని వారికి ఈ నెల 18న మాత్రలు పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు.