శ్రీకాకుళం పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్, టిపిఎమ్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక పరిశీలించారు సోమవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తును నిర్వహించాలని సిబ్బందికి ఈ సందర్భంగా ఆదేశించారు. శాంతియుత వాతావరణంలో సామరస్యంగా ఓటింగ్ జరిగేటట్లు సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పి రాధిక సూచించారు.