గుంటూరు నగరంలో ఓ ప్రవేట్ ఉద్యోగి అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొన్నూరు మండలం ఆలూరు కు చెందిన దేవి వరప్రసాద్ (30) గుంటూరు నగరంలోని ఓ నిత్యవసరాల షాపింగ్ మాల్ లో పనిచేస్తూ డొంక రోడ్డులో నివాసం ఉంటున్నాడు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం అధికంగా అప్పులు చేసి అప్పుల బాధ భరించలేక ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.