సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా ఆదివారం నిర్వహించారు. స్వామివారికి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సీతా రామాంజనేయ భక్త సమాజం వారిచే సంకీర్తన చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa