ఈరోజు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సందర్భంగా విజయనగరం కేంద్రంలో కస్పా హై స్కూల్ లో ఓటు హక్కును విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వినియోగించుకున్నారు. సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి రాష్ట్ర ప్రజలు అందరూ అండగా నిలిచారు అనే సందేశాన్ని పంపించేందుకు పట్టభద్రుల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి మొదట ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.