ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యలో జగన్‌ పాత్ర లేకపోతే అవినాశ్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 01:53 PM

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో సీఎం జగన్‌కూ పాత్ర ఉందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయవాడ  వన్‌టౌన్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి హత్య చేసినట్టు ఈ కేసులో నిందితులు సీబీఐకి చెప్పారన్నారు. ఈ హత్యలో జగన్‌కూ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని చెప్పిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డినీ విచారించాలని డిమాండ్‌ చేశారు. వివేకా రెండో పెళ్లితో వివాదాలు వచ్చి, హత్య జరిగిందని కథలు అల్లడం సిగ్గుచేటన్నారు. వివేకాను పైశాచికంగా హత్యచేసి టీడీపీపై నింద వేశారని, 2019లో వివేకా హత్య జరగకపోతే జగన్‌ అధికారంలోకి వచ్చేవాడే కాదని అన్నారు. హత్యలో జగన్‌ పాత్ర లేకపోతే అవినాశ్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com