ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బి. మఠం మండలం లో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పుట్టా సుధాకర్ యాదవ్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి కార్యకర్తలతో సమావేశమై వివిధ అంశాల పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ లాయర్ పట్టాభి, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.