చిత్తూరు జిల్లా అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత ఎంపీ మిథున్‌రెడ్డికి లేదని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాకు వచ్చిన ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా అని ఆయన సవాల్ చేశారు. ఏరోజైనా సరే చిత్తూరు జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిశ్రమలపై టీడీపీ బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు సెల్కాన్, సుజికీ వంటి అనేక పరిశ్రమలు చిత్తూరు జిల్లాకు తెచ్చారని గుర్తు చేశారు. అమర్‌రాజాను చిత్తూరు జిల్లా నుంచి పారిపోయేలా చేసిన వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం విధ్వంసమే తప్ప.. కొత్తగా చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.