ఎన్నికల కోడ్‌ను టీడీపీ నేతలకు ఒకలా, వైసీపీ నాయకులకు మరోలా ఎన్నికల కమిషనర్ అమలు చేస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. వైసీపీకి వత్తాసు పలకకుండా ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు. లోకేశ్‌ను పాదయాత్ర క్యాంప్ సైట్ నుంచి పంపించేసి, వైసీపీ నాయకులు సభలు, ర్యాలీలు పెట్టుకోవడం సమంజసమా? నెల పాటు లోకేశ్ చిత్తూరు జిల్లాలో ఉంటే అభివృద్ధిపై మాట్లాడని ఎంపీ మిఽథున్‌రెడ్డి.. లోకేశ్ క్యాంప్‌సైట్ నుంచి వెళ్లిపోయాక చర్చకు రమ్మనడమేంటని మండిపడ్డారు.