మంత్రి ఉషశ్రీ చరణ్‌ను మంత్రివర్గం నుంచి గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు పంచిన డబ్బుల లెక్కలు చూస్తూ మంత్రి అడ్డంగా బుక్కయ్యారు. అక్రమాలకు పాల్పడుతూ రెడ్ హ్యాండెట్‌గా దొరికిన ఉషశ్రీ చరణ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. స్వయంగా మంత్రులే డబ్బుల పంపిణీకి దిగడం దారుణం’ అని ఆదివారం రాత్రి ట్వీట్ చేశారు.