అనంతపురం జిల్లా, రాప్తాడు పోలింగ్ బూత్ నంబర్ 150లో దొంగ ఓటర్లను గుర్తించినట్లు టీడీపీ నేతలు తెలియజేసారు. నలుగురు దొంగ ఓటర్లను పట్టుకుని టీడీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి పోలింగ్ బూత్‌లో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రభావితం చేస్తూ వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కనిపించారు. ఇక ప్రొద్దుటూరులోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. బహిరంగంగానే వైసీపీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు దగ్గరలోనే డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వైవీఎస్తోపాటు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు రూ. 1000 చొప్పున వైసీపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. సమీపంలో పోలీసులు ఉన్నా కూడా చర్యలు శూన్యమన్నారు.