తమిళనాడు మాజీ సీఎం, అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిపై కేసు నమోదైంది. తనపై పళనిస్వామి నేతృత్వంలో పలువురు అన్నాడీఎంకే నేతలు దాడి చేశారని ఏఎంఎంకే నేత రాజేశ్వరన్ ఫిర్యాదు మేరకు పళనిస్వామి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు అవనియపురం పోలీసులు తెలిపారు. కాగా అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై రాజేశ్వరన్ మీద కూడా కేసు నమోదు చేశారు.