బిహార్ లోని కిషన్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. కొచధమన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మస్తాన్ చౌక్ సమీపంలోని రెండు ఆలయాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో బజ్‌రంగ్‌బలి ఆలయం పాక్షికంగా ధ్వంసం కాగా, దుర్గామాత ఆలయం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఘటనపై సిట్ ఏర్పాటు చేసి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa