ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టేట్ పోలీసులతో న్యాయం జరగదని, కేంద్ర బలగాలను పిలిపించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్‌ను కోరారు. దొంగ ఓట్లను అడ్డుకుని, వాస్తవ పట్టభద్రులతో ఓటింగ్ జరిపించేలా సీఎస్, డీజీపీ జోక్యం చేసుకోవాలన్నారు. దీనిపై ఆదివారం ఆయన ఈసీకి లేఖ రాశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..... అనేకమంది అధికారులు జగన్‌కు జీ హుజూర్ అంటున్నారని ఆరోపించారు. బోగస్ ఓట్లు చేర్చారని, తప్పుడు విధానాలతో ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకోవాలని వైసీపీ చూస్తోందని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. కాగా, పోలింగ్ ముగిశాక లోకేశ్ మళ్లీ వస్తారని, మిథున్‌రెడ్డికి దమ్ముంటే ఢిల్లీకి పారిపోకుండా తంబళ్లపల్లిలో ఉండాలని ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు సవాల్ చేశారు.