ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 02:05 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వలంటీర్లు డబ్బులు, మందు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆరోపించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘విశాఖలో ఎంపీపీ డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. ఒక్కో ఓటుకు రూ.10-15వేలు పంచుతున్నా.. ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోంది’ అరి మండిపడ్డారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com