వచ్చే నెలలో ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలుకాగా.. నేటి వరకు 2.50 లక్షల మందికి పైగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వెల్లడించింది. కాగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 22న తెరుచుకోనుండగా.. కేదార్ నాథ్ గుడి ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకుంటాయి.