విజయనగరం జిల్లా, రాజాం పరిధిలోని పొనుగుటివలసలో నాలుగు మహిళా సంఘాలకు నగదు చెల్లించవద్దని మెప్మా అధికారి రత్నం రాజాం ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్‌కు లేఖరాశారు. పొనుగుటివలసకు చెందిన సిరిసంపద సమాఖ్య పరిధిలోని పలు సంఘాల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణ బృందం గు ర్తించిందని తెలిపారు. విచారణ జరుగు తున్న నేపథ్యంలో మరిన్ని అక్రమ లావా దేవీలకు ఆస్కారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గంగోత్రి, సీతా రామ, శ్రీరామసీత, సిరిసంపద సమాఖ్యల నుంచి గాని, వాటి పరిధిలోని సుమారు 70 సంఘాల నుంచి గాని విత్‌డ్రాకు అవకాశంఇవ్వవద్దని కోరినట్లు రత్నం తెలి పారు. పలుసంఘాల్లో ఇప్పటికే సుమారు రూ.18 లక్షల మేరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు విచారణ బృందం గుర్తించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాగా సోమవారం జరగాల్సిన పొనుగుటి వలసలోని మహిళా సంఘాలకు సంబంధించిన విచారణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారానికి వాయిదావేసినట్లు రత్నం తెలిపారు.