ఏపీలో జగన్ పని అయిపోయిందని.. దానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికలేనని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఓటమి భయంతోనే దొంగ ఓట్లు వేయిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో సంక్షేమం, అభివృద్ధి చేసి ఉంటే ఓట్లను ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరిలో వైసీపీకి మెజార్టీ ఓటర్లు ఉన్నా ఓటమి భయంతో పెద్ద ఎత్తున డబ్బు తాయిలాలు పంపిణీ చేస్తున్నారన్నారు. జగన్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఆర్థిక సంఘం నిధుల్ని మళ్లించి పంచాయితీలను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.