ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని.. ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఎంపీ మిథున్ రెడ్డి కడప క్రాస్ నుంచి తంబళ్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారని తెలిపారు. 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉన్నా... ఆ నిబంధనలు ఎంపీ ఉల్లంఘించారన్నారు.