అమలాపురం బండారు లంక విజ్ డం స్కూల్ విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా 12 మంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ఏడుగురిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్పృహ తప్పి పడిపోయిన విద్యార్థులంతా ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న వారే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్ళితే.... ప్లాస్టిక్ వ్యర్ధాలు ప్రాణాంతకమైనవి.. దాని వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్ధలు కూడా నెత్తి నోరు బాదుకుంటున్నాయి. అయినా కూడా ప్లాస్టిక్ వాడకానికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఈ ప్లాస్టిక్ కారణంగానే 12 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బండారు లంక విజ్ డం పాఠశాలకు సమీపంలో ప్లాస్టిక్ వ్యర్ధాలకు నిప్పు పెట్టడంతో భారీగా వాయు కాలుష్యం జరిగింది. అది పీల్చిన 20 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.