సీఈసీ రాజీవ్ కుమార్ కు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. మంత్రి ఉషా శ్రీ చరణ్ డబ్బుల పంపిణీపై క్యాడర్ కు సూచనలిస్తున్న వీడియో బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.