ఉత్తరాంధ్ర పట్టభ్రదుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక ఓట్ల లెక్కింపుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కంపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 400 మంది ఉద్యోగులతో కూడిన రెండు బృందాలను ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేశారు. వీరికి రెండు దశల్లో శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్లో వంద మంది చొప్పున ఉంటారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బృందం, రాత్రి 8 నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు మరొక బృందం ఉంటుంది.