గుంటూరు: ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 134 కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు ఉమ్మడి గుంటూరు ఇంటర్ బోర్డు యంత్రాంగం ఏర్పాటు చేసింది. జేఈఈ తరహాలో ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని సోమవారం ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. గతంలో ఒక్క నిమిషం ఆలస్యమైతే అనుమతించేవారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నిమిషం నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్నారని తెలిపారు.