విశాఖ నగరం నుండి ఇంకో చోటికి రైళ్లలో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు ఎంతో కష్టంగా మారుతుంది. ఉదయం సాయంత్రం రద్దీ వేళలో సీట్లు లభించక ప్రయాణికులతో కిటకిటలాడి భోగిల్లోకి దూరెందుకు అవకాశం లేక ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం విశాఖ నుండి కోణార్క్ కు వెళ్ళే ట్రైన్ లో ఖాళీ లేక లుంగి పంచలతో ప్రయాణికులు సీట్ల రూపం చేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే శాఖ అధికారులు స్పందించాలంటున్నారు ప్రయాణికులు.