ఏపీలోని కర్నూలులో మంగళవారం దారుణం జరిగింది. చింతల మునినగర్ కు చెందిన శ్రావణ్ అనే యువకుడు తన భార్యతో పాటు అత్తామామలపై కత్తితో దాడి చేశాడు. శ్రావణ్ కు తన తండ్రి వెంకటేశ్వర్లు కూడా సహకరించాడు. ఈ దాడిలో శ్రావణ్ భార్య కృష్ణవేణి(23), అత్త రమాదేవి(50) చనిపోగా, మామ ప్రసాద్ కు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. శ్రావణ్, కృష్ణవేణిలకు ఈ నెల 1న వివాహం జరిగింది.