సమస్యల పరిష్కారం కోసం అడ్వకేసి ఒక ఆయుధం అని పార స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ నిమ్మ రాజు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. మంగళవారం నాడు సంతనూతలపాడులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానవ హక్కుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సంఘం అయిన నిలబడాలి అంటే ఆ సంఘము సంబంధిత సభ్యుల సమస్యలను గుర్తించి వారిని అడ్వకేసి ద్వారా సంబంధిత అధికారులు వ్వ్యక్తులకు రాత పూర్వకంగా వివరించి వాటి పరిషకారానికి ప్రయత్నం చేయాలని తెలిపారు. ఇది ఒక్కరుగా చేయలేరని సంఘంగా మాత్రమే సాధ్యం అని చెప్పారు. ఇ అడ్వకేసై ద్వారా పాటశాలలోనే కాకుండా గ్రామ సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు అని చెప్పారు. ఇక నుండి ఇ సంఘం సమావేశాలు ప్రతి నెల జరుపుకోవాలని అలాగే అవగాహన సదస్సు ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవాలని సంఘము సభ్యులు నిర్ణయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa