నర్సీపట్నంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద బంద్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వాసవి కళ్యాణ మండపం నుంచి బయలుదేరి అబిడ్స్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసిఆర్డీవో కార్యాలయం వద్ద మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. తాము రోడ్డు విస్తరణకు అడ్డు కాదని టిడిఆర్ బదులు నగదు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.