ఎలమంచిలి: మండలం ఎలమంచిలి మండలం పోతిరెడ్డి పాలెం జంక్షన్ సమీపంలో కేసు నెంబర్ 30/2015 కు సంబంధించి హత్య కేసులో నిందితుడకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి గోవర్ధన్ ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష 2500 రూపాయలు జరిమానా విధించినట్లు ఎలమంచిలి రూరల్ ఎస్సై సన్నీ బాబు తెలిపారు. నిందితుడు బీహార్ రాష్ట్రం గయా జిల్లాకు చెందిన రామ్ నాథ్ సింగ్ గా తెలిపారు. పోతిరెడ్డి పాలెం సమీపంలో చేనుబోయిన సైలాస్ సింఘ్ దాబా నడుపుకుంటూ కుటుంబంతో నివసించేవాడని కాగా రామ్నాథ్ సింగ్ కూడా అదే దాబాలో పనిచేసేవాడని ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవపడి ముద్దాయి. రామ్ నాథ్ సింగ్ శైలాస్ సింగ్ ను ఇనుప రాడ్డుతో మోదీ హతమార్చడంతో అతని భార్య సునీత దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలతో నిందితులను కోట్ల హాజరు పట్టడంతో విచారించిన జిల్లా కోర్టు ముద్దాయికి శిక్ష విధించిందని తెలిపారు.