నేషనల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్ఈసీ) బృందం మంగళవారం స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించింది. శిక్షణలో భాగంగా 17 మంది సభ్యులతో కూడిన బృందం స్టీల్‌ప్లాంట్‌కు చేరుకుని ఈడీ (వర్క్స్) బిల్డింగ్‌లో మోడల్ రూమ్‌ను తిలకించారు. ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి ప్రక్రియ, ముడి పదార్థాల సరఫరా, ఉత్పత్తుల రవాణా గురించి ఉక్కు అధికారులు వారికి వివరించారు. స్టీల్‌ప్లాంట్‌కు వచ్చిన అవార్డుల గ్యాలరీని వారు సందర్శించారు. అలాగే టీటీసీ సెంటర్‌ను సందర్శించి శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.