ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గుట్టపై నిర్మించిన కళాశాలకు మొదటి నుంచి రహదారి సౌకర్యం లేకపోవడంతో తాత్కాలికంగా కంపచెట్ల మధ్యనే రహదారి ఏర్పాటు చేసుకున్నారు. నేడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రహదారి సక్రమంగా లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నా నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.