అనంతపురం జిల్లా, చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్టులో మంగళవారం రొద్దం మండలం నారనాగేపల్లికి చెందిన యువకుడు గోపాలకృ ష్ణ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. నారనాగేపల్లికి చెందిన ఈడిగ నరసింహ కుమారుడు గోపాలకృష్ణ పుట్టుకతోనే అంధుడు. రెండు కళ్లు కనబడక పోవడంతో ఇంటిపట్టునే ఉండేవాడు. రెండు నెలల క్రితం బ్రెయిలీ లిపి ద్వారా కంప్యూటర్ నేర్చుకునేందుకు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద ఓ స్వచ్ఛంద సంస్థలో చేరాడు. అయితే కంటిచూపుతో పాటు చెవులు కూడా వినిపించక మందగించాయి. దీంతో మనస్తాపం చెంది తెల్లవారుజామున స్నానపు గదిలో ఉరేసుకున్నాడు. ఉదయం సహచర విద్యార్థులు, సంస్థ నిర్వాహకులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చా రు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.