ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 12:50 PM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పెదపారుపూడి మండలం చినపారుపూడికి చెందిన నగుళ్ల కోటేశ్వరరావు (38), అతడి బంధువు మసిముక్కుల రాజేశ్వరి (28) బైక్‌పై కలిదిండి బంధువుల ఇంటికి వచ్చి వారిని పరామర్శించి తిరిగి బైక్‌పై చినపారుపూడి వెళ్తుండగా, కోరుకొల్లు శివారు బొబ్బిలిగూడెం సమీపంలో ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై నుంచి పడిపోవటంతో కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న రాజేశ్వరికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణాలు ఇంత వరకు తెలియలేదని కలిదిండి హెడ్‌ కానిస్టేబుల్‌ గోవర్ధన్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa