ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:55 PM

రెండో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి  మాట్లాడారు.  నేలలను పునర్జీవింప చేస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. నిష్ణాతులైన ప్రకృతి వ్యవసాయ కార్యకర్తల ద్వారా నిబద్ధతతో అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు, వీడియోలు, నమూనాలు, రైతుభరోసా కేంద్రాలతో అనుసంధానం చేసి రైతులకు అండగా ఉంటున్నాం. విత్తనాలు, కిచన్ గార్డెన్స్, ప్రకృతి వ్యవసాయానికి ఇన్పుట్ ల సామూహిక తయారీ, ఉపకరణాలు, నిధులు అందుబాటులో ఉంచడం, స్వయం సహాయక సంఘాలను ఇందులో భాగస్వాములను చేయడం చేస్తున్నాం. దాదాపుగా 658 గ్రామీణ మండలాల్లో 3,009 ఆర్బీకేల్లో 3,730గ్రామ పంచాయితీల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్నాం అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa