ఆధార్‌కార్డు ఉన్నవారికి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 15 నుంచి జూన్ 14 వరకు మూణ్నెల్లపాటు ఆధార్ డాక్యుమెంట్ల అప్డేషన్ను ఆన్లైన్ ద్వారా ఉచితంగా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. గతంలో ఆధార్ పోర్టల్ ద్వారా ఇలా అప్డేషను చేసుకోవాలంటే రూ.25 చెల్లించాల్సి ఉండేది. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.