ప్రపంచ దేశాల్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా శీతాకాలంలో కొవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతాయి, కానీ ప్రస్తుం వేసవిలో కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో 4,937 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 54 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అందులో 40 కేసులు హైదరాబాద్లోనే నమోదవటం ఆందోళన కలిగిస్తుంది.